తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా హక్కులను అమలు చేయకుంటే ఉద్యమమే' - గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్​లోని కుమురం భీం విగ్రహానికి గిరిజన నేతలు నివాళులు అర్పించారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు అమలు చేయాలని గిరిజన ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు.

రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను అమలు చేయాలి : గిరిజన ఐక్య వేదిక

By

Published : Aug 9, 2019, 7:10 PM IST

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ర్యాలీగా తరలివచ్చిన గిరిజనులు ట్యాంక్ బండ్​పై ఉన్న కుమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని గిరిజన ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు వివేక్ వినాయక్ తెలిపారు. అయినప్పటికీ ఆదివాసీ హక్కులను పూర్తిగా పరిరక్షించేందుకు ప్రభుత్వాలు కృషి చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం విషయంలోనూ ఆదివాసీ ప్రాంతాలను, స్వీయ పరిపాలన హక్కులను పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకకైనా రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఆందోళన చేస్తామని వివేక్ వినాయక్ హెచ్చరించారు.

రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను అమలు చేయాలి : గిరిజన ఐక్య వేదిక
ఇవీ చూడండి : కమలతీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎంపీ వివేక్

ABOUT THE AUTHOR

...view details