రెండు పడక గదులు ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని హైదరాబాద్‌లో బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. ఐమాక్స్ ఎదురుగా నిర్మిస్తోన్న రెండు పడక గదుల గృహాలను స్థానిక నాయకులకు కేటాయించారని ఖైరతాబాద్ ఇందిరానగర్ బస్తీవాసులు మండిపడ్డారు. సొంతిళ్లు ఉన్న వారికి ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు కేటాయించాలని... లేని పక్షంలో ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని బస్తీ వాసులు హెచ్చరించారు.
'నాయకులకే ఇళ్లు ఇస్తారా ? అయితే ఆమరణ దీక్ష చేస్తాం' - DOUBLE BED ROOMS ISSUE
నాయకులకే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్నారని ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు.

తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు ఇళ్లు ఇప్పించాలి : బస్తీ వాసులు
తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు ఇళ్లు ఇప్పించాలి : బస్తీ వాసులు
ఇవీ చూడండి : హుజూర్‌నగర్‌లో తెరాసకు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ