తెలంగాణ

telangana

ETV Bharat / state

"జగన్‌ సుపరిపాలన అందిస్తే... మళ్లీ సినిమాలు చేసుకుంటా" - pawan speech at long march in vishaka

ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని జనసేనాని అన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందితే నేను రాజకీయాల్లోకి రావల్సిన అవసరమే లేదని చెప్పారు.

పవన్ కల్యాణ్

By

Published : Nov 3, 2019, 7:50 PM IST

"జగన్‌ మంచి పరిపాలన అందిస్తే.. మళ్లీ సినిమాలు చేసుకుంటా"

తాను అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోట్ల సంపాదన వచ్చే సినిమాలను కూడా ప్రజల కోసమే వదులుకున్నానని ఏపీలోని విశాఖ సభలో జనసేనాని చెప్పారు.పాత జైలురోడ్డు ఎదురుగా జనసేన లాంగ్‌మార్చ్ సభలో ఆయన ప్రసంగించారు.

"తను డబ్బుతో పార్టీని నడిపే వ్యక్తిని కాదని.. భావజాలంతో నడుపుతున్నాన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు కూడా అండగా నిలబడ్డానని తెలిపారు. దత్తపుత్రుడు, బి-టీమ్‌ అని వైకాపా తనకు పేర్లు పెట్టింది. వైకాపా విమర్శలకు బలంగా సమాధానం చెప్తా. ఎంత ఆవేదన ఉంటే ఇంతమంది రోడ్ల మీదకు వస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం సరిగా పని చేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగింది. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తన మనసుకు బలంగా తాకాయన్నారు. ఇసుక కొరత వల్ల అభివృద్ధి ఆగిపోతోందని... ఎన్నికల్లో ఓడిపోయానని అలుసా.. ప్రజల గుండె‌ల్లో స్థానమే నాకు పెద్ద పదవని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి పరిపాలన అందితే తను రాజకీయాల్లోకి రావల్సిన అవసరమే లేదన్నారు. జగన్‌ మంచి పరిపాలన అందిస్తే.. మళ్లీ సినిమాలు చేసుకుంటానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

ABOUT THE AUTHOR

...view details