పీఎం కేర్స్ ఫండ్ కు.. హైదరాబాద్ కు చెందిన ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు కలిసి రూ. 51.14 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆ కంపెనీ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ విజయ్ లు గవర్నర్ తమిళిసై కు చెక్కును అందజేశాారు.
పీఎం-కేర్స్ ఫండ్‌కి ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ విరాళం! - పీఎం-కేర్స్ ఫండ్‌కి ఐడీపీ కంపెనీ విరాళం!
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ ఫండ్‌కు.. ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 51.14 లక్షలను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ కంపెనీ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్లు.. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై కు చెక్కును అందించారు.
పీఎం-కేర్స్ ఫండ్‌కి ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ భారీ విరాళం!
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో.. ఉద్యోగులు విరాళంగా ఇచ్చిన మొత్తానికి సమానంగా యాజమాన్యం చెక్కును ఇవ్వడం పట్ల గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా ఐడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులను ప్రశంసించారు.
ఇదీ చూడండి:దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు