తెలంగాణ

telangana

ETV Bharat / state

పాడేరు ఘాట్ రోడ్​లో అమ్మవారి విగ్రహం ధ్వంసం - Idol of Goddess destroyed news

ఏపీలోని విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్ కోమలమ్మ పనుకులో అమ్మవారి విగ్రహం ధ్వంసమైంది. రెండు రోజుల కిందటే అమ్మవారి పాదాలు పగులకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

paderu ghat road, goddess idol
పాడేరు ఘాట్​ రోడ్డు, అమ్మవారి విగ్రహం

By

Published : Jan 1, 2021, 5:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లో రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్​లో అమ్మవారి విగ్రహం, పాదాలు విరగ్గొట్టారు. రెండు రోజుల కిందటే దుండగులు.. అమ్మవారి పాదాలు పగుల కొట్టినట్లు స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఘాటికొండ మలుపులో ఉండే ఈ అమ్మవారికి.. చుట్టుపక్కల నాలుగు పంచాయతీల్లోని ముప్పై గ్రామాల ప్రజలు మెుక్కులు తీర్చుకుంటారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:మంచుతెర మాటున ట్యాంక్​బండ్​ అందాల కనువిందు

ABOUT THE AUTHOR

...view details