హైదరాబాద్ నగరంలో మిస్టర్ అండ్ మిసెస్ ఐకాన్ ఇండియా పేరిట అందాల పోటీలు నిర్వహించారు. పలువురు అమ్మాయిలు, అబ్బాయిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏజీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ముద్దుగుమ్మలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ముంబై, చెన్నై, బెంగుళూరు తదితరల ప్రాంతాల్లో ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తుది పోటీలను సెప్టెంబర్ 22న సోమాజిగూడలోని ద పార్క్ హోటల్లో నిర్వహించనున్నుట్లు వివరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే కొత్త వారికి ఇది చక్కటి అవకాశమని పేర్కొన్నారు.
అందాల పోటీలు.. ఆకట్టుకున్న మోడల్స్..
ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే కొత్త వారికి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో ఏజీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మిస్టర్ అండ్ మిసెస్ ఐకాన్ ఇండియా పేరిట అందాల పోటీలను నిర్వహించారు. పలువురు అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నగరంలో అందాల పోటీలు.. పాల్గొన్న యువతీ యువకులు