తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐసెట్ షెడ్యూల్ ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి - తెలంగాణ వార్తలు

ఐసెట్ షెడ్యూల్​ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఏప్రిల్ 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టులో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో పరీక్ష జరగనుంది.

icet-schedule-declared-by-board-of-higher-education-in-telangana
ఐసెట్ షెడ్యూల్ ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి

By

Published : Mar 3, 2021, 7:08 PM IST

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్​ను ఆగస్టులో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఐసెట్ షెడ్యూల్​ను బుధవారం ఖరారు చేసింది. ఏప్రిల్ 4న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆలస్య రుసుముతో జులై 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఆగస్టులో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో ఐసెట్ జరగనుంది.

ఇదీ చదవండి:స్వామీజీ... మా అభ్యర్థిని గెలిపించండి: నారాయణ

ABOUT THE AUTHOR

...view details