మిగిలిన ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ కోసం రేపు మూడో విడత ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. శనివారం ధ్రువపత్రాల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చవని కన్వీనర్ తెలిపారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి ఈనెల 24న అవకాశం కల్పించారు.
రేపటి నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 27 నుంచి 30 వరకు కళాశాలల్లో చేరాలని కన్వీనర్ తెలిపారు.