టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష తేదీలను ఐసెట్ కమిటీ నిర్ణయించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల... మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ... ఆలస్య రుసుముతో మే 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని కమిటీ తెలిపింది.
మే 14 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని... మే 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహణ... మే 29న ప్రాథమిక కీ విడుదల... జూన్ 1 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. జూన్ 13న ఐసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.