తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటకు చెందిన షేక్ అబ్దుల్ మునాఫ్ అనే యువకుడు సహజ సిద్ధమైన చిత్రాన్ని తన కెమెరాలో బంధించాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు పరిధిలోని కటుకూరులో... గోదావరి ఒడ్డున చిన్నారులు ఆడుతున్న క్రికెట్.. అతడిని ఆకర్షించింది.
ఐసీసీ ట్విట్టర్ పేజీలో.. ఆంధ్రా చిన్నారుల ఆట! - ఐసీసీ ట్విట్టర్ ఖాతాలో ఆంధ్రా యువకుడి ఫొటో న్యూస్
ఒక సాధారణ యువకుడు కెమెరా నేత్రంతో చూసిన చిత్రం.. ఐసీసీని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు గ్రామ పరిధిలో.. గోదావరి ఒడ్డున.. సంధ్య వేళ.. చిన్నారులు క్రికెట్ ఆడుతున్న ఆ చిత్రాన్ని... ఐసీసీ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో బుధవారం పోస్ట్ చేసింది.
ఐసీసీ ట్విట్టర్ పేజీలో.. ఆంధ్రా చిన్నారుల ఆట!
సూర్యుడు అస్తమిస్తున్న ఆ సందర్భంలో.. చిన్నారులు ఆడుకుంటున్న తీరు.. అత్యంత సహజసిద్ధంగా ఆ యువకుడు తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. ఈ ఫొటోను ఐసీసీకి ఈ మెయిల్ చేశాడు. చిత్రాన్ని మెచ్చిన ఐసీసీ.. తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంది. ఫొటో తీసిన మునాఫ్ పేరును కూడా.. ఆ చిత్రాలకు జోడించింది. సహజసిద్ధమైన సన్నివేశాన్ని.. కళాత్మకంగా క్లిక్ మనిపించిన మునాఫ్... శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇదీ చదవండి:రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!