ఓఎంసీ అక్రమాల కేసులో తన పేరు తొలగించాలంటూ గగన్ విహార్ సీబీఐ కోర్టులో ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించిందన్నారు.
మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ - మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిస్ఛార్జ్ పిటిషన్
ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో తనపేరును తొలగించాలంటూ సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల లీజు మంజూరులో నిబంధనలో మేరకే వ్యవహరించానని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు.
మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిస్ఛార్జ్ పిటిషన్
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్నారు. గనుల లీజు మంజూరులో నిబంధనల మేరకే వ్యవహరించానని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిగా తన విధులు నిర్వహించానని ఆమె తెలిపారు. ఈ పిటిషన్పై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది.