IAS Smita Sabharwal Tweet : ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఎక్స్(ట్విట్టర్)లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 23 ఏళ్లు అయిన సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన స్మితా సభర్వాల్ కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎంత ముందుకు వెళ్లామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయని పోస్ట్ చేశారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తోందని పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన స్మితా సభర్వాల్ కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పోస్ట్ చేశారు.
సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలి : భట్టి విక్రమార్క
Social Media Trolling On IAs Officer Smita Sabharwal Tweet : తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్, రజత్ కుమార్ పదవీ విరమణ అనంతరం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. రాష్ట్రంలో డైనమిక్ అధికారిణిగా స్మితా సభర్వాల్‌కు ప్రత్యేక పేరుంది.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్మితా సభర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పలువురు సీనియర్ అధికారులు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొత్త మంత్రులను కలుస్తున్నారు. అయితే ఇప్పటి వరకు స్మితా సభర్వాల్ ఎవరిని కలవలేదు, పైగా ఇటీవల నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షకు కూడా హాజరు కాలేదు.