వర్షం నీటిలో తడవాలని పిల్లల నుంచి పెద్దల దాకా ఉంటుంది. ఓ వైపు వాన... మరోవైపు పచ్చని ప్రకృతిని చూస్తే ఎవరికైనా మనసు ఆగదు. అందుకే వాళ్లు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అయినా సరే... వాన నీటిలో తడిసి మురిసిపోయారు.
చిరుజల్లులో సీఎంవో ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సీఎంవో ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినాలు వాన చినుకుల్లో తడిసి మైమరిచిపోయారు.
ప్రకృతిని చూసి పులకరించి... మేడ్చల్ జిల్లా ఎల్లంపేట అటవీ ప్రాంతంలో పర్యటించిన వీరు... అదే సమయంలో వర్షం రావడాన్ని చాలా ఎంజాయ్ చేశారు.
గొడుగులు పట్టుకుని వానలో తడుస్తూ... ఫొటోలను చరవాణుల్లో క్లిక్‌మనిపించారు. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. వర్షం కురుస్తున్న వేళ... ఫొటోలకు ఫోజులు అనే క్యాప్షన్‌తో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆ సిత్రాలను నెటిజన్లతో పంచుకున్నారు.
ఇదీ చదవండి:Tourist places : రా.. రమ్మని.. పర్యాటక ప్రాంతాలు పిలిచెను ఈ వేళ