రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇంఛార్జీ వీసీలుగా ఐఏఎస్ అధికారులు నియామితులయ్యారు. యూనివర్సిటీల ఉపకులపతుల పదవీకాలం నేటితో ముగిసింది. ఇంచార్జీ వీసీలుగా ఉస్మానియా, మహాత్మగాంధీ యూనివర్సిటీలకు అర్వింద్ కుమార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వి.అనిల్ కుమార్, అంబేడ్కర్ యూనివర్సిటీకి సి.పార్థసారథి, జేఎన్టీయూహెచ్కి జయేష్ రంజన్, కాకతీయ యూనివర్సిటీకి బి.జనార్దన్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయానికి వి.అనిల్ కుమార్, పాలమూరు యూనివర్సిటీకి రాహుల్ బొజ్జాలను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వీసీల నియామకం కోసం కసరత్తు చేపట్టిన సర్కారు.. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది.
'ఇంఛార్జీ వీసీలుగా ఐఏఎస్ అధికారులు' - అంబేడ్కర్ యూనివర్సిటీకి
రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ఎనిమిది యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తాత్కాలిక ఉపకులపతులుగా ఐఏఎస్ అధికారులు నియామితులయ్యారు.
ఇంఛార్జీ వీసీలుగా ఐఏఎస్ అధికారులు'