తెలంగాణ

telangana

ETV Bharat / state

IAS Transfers In Telangana : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS
IAS

By

Published : Jul 14, 2023, 6:27 PM IST

Updated : Jul 14, 2023, 9:57 PM IST

18:23 July 14

IAS Transfers In Telangana : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Officers Transfers And Posting In Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. పోస్టింగ్‌ల కోసం వేచి చూస్తున్న పలువురు ఐఏఎస్‌ల పోస్టింగ్‌లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పోస్టింగ్‌ల కోసం వేచి ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు పలువురు ఐఏఎస్‌లకు బదిలీలు జరిగాయి.

ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా శశాంక్‌ గోయల్‌, యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్‌, ఆర్కియాలజీ డైరెక్టర్‌, క్రీడాపాధికార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయుష్‌ డైరెక్టర్‌గా హరిచందన, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా అలగు వర్షిణి, క్రీడల సంచాలకులుగా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శిగా కె.హరిత, పర్యాటకశాఖ సంచాలకులుగా కె.నిఖిల, వ్యవసాయ శాఖ ఉపకార్యదర్శిగా సత్యశారదాదేవి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాం ఆలకు పోస్టింగ్​లు ఇచ్చారు.

ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య. పెద్దపల్లి కలెక్టర్‌గా ముజమిల్‌ ఖాన్‌. టీఎస్‌ఫుడ్స్‌ ఎండీగా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్‌ జైన్‌ , సెర్ప్‌ సీఈవోగా పి.గౌతం, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఎస్‌.స్నేహ, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా మంద మకరందును నియమించారు.

District Collectors Transfers in Telangana : సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గిరిమ అగర్వాల్‌, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బి. చంద్రశేఖర్‌, కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌గా జడ్ల అనుశ్రీ, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, నాగర్‌ కర్నూల్‌ అదనపు కలెక్టర్‌గా కుమార్‌ దీపక్‌, జగిత్యాల అదనపు కలెక్టర్‌గా దివాకర్‌, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మనుచౌదరి, మహబూబ్‌ నగర్‌ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్‌ ధోత్రేలను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.

  • బదిలీలైనా ఐఏఎస్​ అధికారులు వీరే..
ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా శశాంక్‌ గోయల్‌
యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌
ఆయుష్‌ డైరెక్టర్‌ హరిచందన
హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ అలగు వర్షిణి
క్రీడల సంచాలకులు కొర్రా లక్ష్మి
ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌ హైమావతి
ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి కె.హరిత
పర్యాటకశాఖ సంచాలకులు కె.నిఖిల
వ్యవసాయ శాఖ ఉపకార్యదర్శి సత్యశారదాదేవి
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాం ఆల
ములుగు కలెక్టర్‌ ఐలా త్రిపాఠి
కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య
పెద్దపల్లి కలెక్టర్‌ ముజమిల్‌ ఖాన్‌
టీఎస్‌ఫుడ్స్‌ ఎండీ సంగీత సత్యనారాయణ
భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్‌ జైన్‌
సెర్ప్‌ సీఈవో పి.గౌతం
హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టి
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ ఎస్‌.స్నేహ
గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌
నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మకరందు
సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గిరిమ అగర్వాల్‌
రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ ప్రతిమ సింగ్‌
సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌
కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ జడ్ల అనుశ్రీ
పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ చెక్క ప్రియాంక
నాగర్‌ కర్నూల్‌ అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
జగిత్యాల అదనపు కలెక్టర్‌ దివాకర్‌
కామారెడ్డి అదనపు కలెక్టర్‌ మనుచౌదరి
మహబూబ్‌ నగర్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే

Transfers in Telangana Revenue Department : మరోవైపు రెవెన్యూ శాఖలోనూ ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్​లకు స్థాన చలనం అయింది. మొత్తం 38 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పలువురు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు ఉన్నారు. వెయిటింగ్​లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగులు ఇచ్చారు. పలువురిని వెయిటింగ్​లో ఉంచారు. బదిలీ అయిన పోస్టుల్లో శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పోస్టులు 30కి పైగా ఉన్నాయి.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బదిలీలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పోస్టింగుల్లో మూడేళ్లకు పైగా ఉన్న వారితో పాటు మరికొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బదిలీలు, పోస్టింగులపై నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. అందుకు అనుగుణంగా పలువురు అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. త్వరలోనే మరికొందరిని కూడా బదిలీ చేయనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 14, 2023, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details