IAS Officers Transfer in Telangana :రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. నేడు మరో ఆరుగురు సీనియర్ ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని(IAS Transfers) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను బదిలీ చేసి రవాణా శాఖ కమిషనర్ గా నియమించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ. శ్రీధర్ నియమించిన ప్రభుత్వం టీఎస్ఐఐసీ వీసీఎండీగా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హొలికేరిని బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా మేడ్చల్ కలెక్టర్ గౌతం పొత్రుకు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా నియమితులయ్యారు. ఇ.వి.నర్సింహారెడ్డిని టీఎస్ఐఐసీ ఎండీ బాధ్యతలను నుంచి బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిగా ప్రభుత్వం నియమించింది. ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారుల బదిలీలు వివరాలు :
- రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్
- ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌ను నియమించగా, అదనపు బాధ్యతగా టీఎస్‌ఐఐసీ ఎండీగా నియామకం
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోలికేరిని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశం
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్
- ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజాకు బాధ్యతలు
- గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహారెడ్డి నియామకం
- పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా డీఎస్ చౌహాన్ నియామకం
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీ - రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు