IAS Krishnaiah wife approached the Supreme Court: 1994లో సంచలనం సృష్టించిన తెలుగు ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం ఉదయం సహర్సా జైలు నుంచి విడుదలయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ కృష్ణయ్య భార్య ఉమా ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కృష్ణయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ 14ఏళ్లుగా జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు.
ఆ తరువాత బిహార్ ప్రభుత్వం జైలు మాన్యువల్‌లో ఉన్న చట్టలకు సవరణలు చేసి ఆనంద్ మోహన్‌ను విడుదల చేసింది. దీనిపై కృష్ణయ్య భార్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "జీవిత ఖైదు, మరణశిక్షకు ప్రత్యామ్నాయంగా విధించబడినప్పుడు, కోర్టు నిర్దేశించిన విధంగా ఖచ్చితంగా శిక్ష అమలు చేయాలని" పిటిషన్లో పేర్కొన్నారు. బిహార్ సర్కార్ నిర్ణయంపై దళిత సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బిహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సివిల్ సర్వెంట్స్ సంఘం సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయంపై మరోమారు పునఃసమీక్షించుకోవాలని కోరింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందించారు. జైలు నుంచి విడుదలైన ఆనంద్‌మోహన్ హైదరాబాద్‌కు వచ్చి క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారన్న సమాచారం మనసును కలచివేస్తోందన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లో అడుగుపెట్టనిచ్చేదిలేదని తేల్చి చెప్పారు.
హత్య జరిగిన రోజు: అది 1994 సంవత్సరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సమాజంలో, జర్నలిస్టు వర్గాల్లో మంచి పేరున్న కృష్టయ్యకు అప్పటికే భార్య ఉమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విధి నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన హాజీపూర్‌లో ముఖ్యమైన మీటింగ్‌కు వెళ్లి వస్తున్న ఆయన్ను కొందరు వ్యక్తులు అడ్డగించారు.
ఆ తరువాత పరుష పదజాలంతో దూషించారు. కారులో నుంచి ఆయన్ను బయటకు లాగి రాళ్లతో కొట్టారు. తీవ్ర గాయాలపాలైన కృష్ణయ్య మృతి చెందారు. ఆ తరువాత 2007లో ఈ కేసులో ఆనంద్ మోహన్‌కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింగా.. ఆ తరువాత పాట్నా కోర్టు జీవితకాలం శిక్ష విధించింది. ఆ తరువాత సుమారు 14ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.