నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఐఏఎస్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన... సెల్ఫీ ఆఫ్సక్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. అమెజాన్‌లో విడుదల చేసిన పదిహేను రోజుల్లోనే ఈ పుస్తకం విశేషాదరణ పొందింది. కొత్త రచయితల పుస్తకాల విక్రయ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. ఎందరో విజేతల జీవితాలు... ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మార్గాలను ఇందులో పొందుపరిచారు. విజయం ఏ ఒక్కరి సొత్తూ కాదంటోన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు' - సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తక రచయిత
ఆయన ఓ ఐఏఎస్ అధికారి. తెలుగు రాష్ట్రాల్లోని పలు శాఖల్లో సేవలందించి... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన రచించిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అమెజాన్‌లో కొత్త రచయితల పుస్తకాల విక్రయ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆయనే ప్రస్తుత సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. ఆ పుస్తకం రాయడానికి దారి తీసిన పరిస్థితులు.. విజయ సాధనకు సూచించిన మార్గాలు ఆయన మాటల్లోనే...
బుర్రా వెంకటేశం