IAS, IPS officers Promotions in Telangana : రాష్ట్రంలో 41 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 29 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులున్నారు. 1997 బ్యాచ్‌కి చెందిన శైలజారామయ్యర్, ఎన్.శ్రీధర్, అహ్మద్‌నదీం, వీరబ్రహ్మయ్యలకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 2006 బ్యాచ్‌కు చెందిన రొనాల్డ్‌రాస్, భారతీలఖ్‌పతి నాయక్, విజయేంద్ర, సురేంద్రమోహన్‌లకు కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. 2009 బ్యాచ్‌కి చెందిన సత్యనారాయణ, అర్విందర్ సింగ్, సర్ఫరాజ్ అహ్మద్, ఎం.ప్రశాంతిలు అదనపు కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. 2013 బ్యాచ్‌కు చెందిన కె.శశాంక, శృతి ఓజా, సీహెచ్ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, హన్మంతరావు, అమోయ్‌కుమార్, కె.హైమావతి, ఎం.హరిత, కేంద్ర సర్వీసులో ఉన్న అద్వైత్ కుమార్‌సింగ్‌లకు సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. 2017 బ్యాచ్‌కు చెందిన రిజ్వాన్ భాషా షేక్, 2018 బ్యాచ్‌కు చెందిన అనుదీప్ దురిశెట్టి, కోయ శ్రీహర్ష, అభిలాష, కుమార్‌దీపక్, ఆదర్శ్ సురభి, హేమంత్ బోర్కండే, నంద్‌లాల్‌పవార్‌లకు ఉప కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. పదోన్నతులు పొందిన ఐఏఎస్‌లు కొత్త హోదాలతో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించింది.
12 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు