తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి కేటీఆర్ - 'వేములవాడ పట్టణ సంక్షేమం, ఆలయాభివృద్ధి నే చూసుకుంటా'

వేములవాడ మున్సిపాలిటీ పాలనా పగ్గాలు చేపట్టిన సందర్భంగా పుర నూతన ఛైర్​ పర్సన్, వైస్ ఛైర్​ పర్సన్ పుర మంత్రి కేటీఆర్​ను మర్యాద పూర్వకంగా కలిశారు. సుపరిపాలనకే పట్టం కట్టాలని మంత్రి కేటీఆర్ వారికి సూచించారు.

త్వరలోనే వేములవాడ అభివృద్ధిపై సమీక్ష : మంత్రి కేటీఆర్
త్వరలోనే వేములవాడ అభివృద్ధిపై సమీక్ష : మంత్రి కేటీఆర్

By

Published : Jan 31, 2020, 10:57 PM IST

శివరాత్రి సందర్భంగా కోటి రూపాయలతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శివార్చన నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడను దర్శించే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్​ను ఆదేశించారు. వేములవాడ పురపాలక నూతన ఛైర్ పర్సన్ మాధవి, వైస్ ఛైర్మన్ మధు.. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్​తో కలిసి వెళ్లి మంత్రి కేటీఆర్​ను కలిశారు.

వేములవాడ పట్టణం, ఆలయం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పురపాలకలో సుపరిపాలనకు నడుం బిగించాలని నూతన ప్రజా ప్రతినిధులకు సూచించారు.

ఇవీ చూడండి : కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ... కీలక చర్చ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details