తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను విస్మరించిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే' - jagan
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా ఇంకా నిరుపేదలకు అన్యాయం జరుగుతూనే ఉందని మాయావతి విమర్శించారు. చంద్రబాబు మీద కోపంతో ఆంధ్రులకు అన్యాయం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బయటకొస్తానని జనసేనాని హెచ్చరించారు.
'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే'
రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ ఆంధ్రులకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా తాను బయటకు రావాల్సి ఉంటుందని జనసేనాని హెచ్చరించారు.
బీఎస్పీ, జనసేన అభ్యర్థులను పవన్ ప్రజలకు పరిచయం చేశారు. మార్పు కోసం తమకు అండగా నిలవాలని కోరారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో యువత తరలివచ్చారు.