రైతులకు మేలు చేసే పిచ్చుకలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ఐ లవ్ స్పారో పేరిట జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
'పిచ్చుకలను పరిరక్షించడానికి ప్రకృతి ప్రేమికులు కదం తొక్కాలి'
అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడుకోవడానికి పర్యావరణ, పక్షి ప్రేమికులంతా కదిలి రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ఐ లవ్ స్పారో పేరిట జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పిచ్చుకలతో పాటు ఇతర పక్షులను కాపాడుకోవడానికి గిఫ్ట్ ఏ నెస్ట్ పేరిట కార్యక్రమం చేపట్టినట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, ఇతర ప్రముఖులకు ఈ నెస్ట్ పంపించనున్నట్లు వెల్లడించారు. అంతరించిపోతున్న పక్షులను కాపాడుకోవడానికి పర్యావరణ ప్రేమికులు ముందుకు రావాలని కోరారు.
పక్షులను రక్షించుకోవడానికి ప్రజలను చైతన్యవంతం చేసే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శోభ చెప్పారు.