కరోనా కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించామే తప్ప లాక్‌డౌన్ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని... ఏపీలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన అంశంలోవైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీచేసిన అంశంపై రజిని స్పందించారు. తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేశానని ఎమ్మెల్యే అన్నారు. నోటీసులు అందిన తర్వాత ఈ అంశంపై సవివరంగా మాట్లాడతానని చెప్పారు.
నేను నిబంధనలు ఉల్లంఘించలేదు: విడదల రజిని - లాక్‌డౌన్ ఉల్లంఘనపై విడుదల రజిని స్పందన
ఏపీ హైకోర్టు నోటీసులపై ఆ రాష్ట్ర వైకాపా ఎమ్మెల్యే విడదల రజిని స్పందించారు. తాను ఎక్కడా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘించలేదని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం అందించేందుకే ప్రయత్నించానని పేర్కొన్నారు.
నేను నిబంధనలు ఉల్లంఘించలేదు: విడదల రజిని