Chikoti praveen క్యాసినో వ్యవహారంలో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. చీకోటి హిట్ మెన్ అనే విదేశీ యాప్‌లో సుపారీ ఇచ్చినట్లు బెదిరిస్తున్నారని వెల్లడించారు. తన ఇంటివద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు.
విచారణలో వారి పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారన్న చీకోటి ప్రవీణ్ - క్యాసినో వ్యవహారం
18:03 August 17
Chikoti praveen విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న చీకోటి ప్రవీణ్
బెదిరింపులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చీకోటి ప్రవీణ్ తెలిపారు. భద్రత కోసం హైకోర్టులో సైతం పిటిషన్ వేశానని.. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. నేను ఏ తప్పు చేయలేదని.. నిబంధనల మేరకే క్యాసినోకు తీసుకెళ్లానని చీకోటి వివరించారు. ఈడీ అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ విచారణ ఇంకా కొనసాగుతోందని.. నాకు అన్నీ పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయని తెలిపారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఈడీ విచారణకు ఎప్పుడు రమ్మన్నా సిద్ధంగా ఉన్నట్లు చీకోటి ప్రవీణ్ వెల్లడించారు.
ఇవీ చదవండి:కోవర్టు రాజకీయాలు చేసేవారికి మునుగోడు ప్రజలు బుద్దిచెప్తారన్న సంజయ్
మహిళ అలాంటి దుస్తులు ధరిస్తే లైంగిక వేధింపుల సెక్షన్ వర్తించదు