Hysea Awards in Hyderabad: "రీ ఇమేజిన్.. రీ థింక్.. రీబిల్ట్ ది ఫ్యూచర్" అన్న అంశంపై జరిగిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అవార్డుల ప్రదానోత్సవం 30వ ఎడిషన్ హైదరాబాద్‌లో ఘనంగా సాగింది. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సియాంట్ వ్యవస్థాపకులు బి.వి.ఆర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఐసీసీలో ఘనంగా హైసియా అవార్డుల ప్రదానోత్సవం - Export and Product Development in IT
Hysea Awards in Hyderabad: హైదరాబాద్‌లో 30వ ఎడిషన్ హైసియా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సియాంట్ వ్యవస్థాపకులు బి.వి.ఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కంపెనీలు, అంకురాలకు అవార్డులను ప్రదానం చేశారు.
రోజంతా సాగిన హైసియా సమావేశంలో చర్చా కార్యక్రమాలు జరగగా సాయంత్రం నుంచి అవార్డు ప్రదానోత్సవం జరిగింది. 50కు పైగా సంస్థలు కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎక్స్పోర్ట్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగంలో మొత్తం 27 కంపెనీలు, అంకురాలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాయి. అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థగా క్యాప్‌జెమినీ అవార్డు అందుకుంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థగా, అత్యంత ఎగుమతులు టర్నోవర్ నమోదైన సంస్థగా రెండు విభాగాల్లో ఎకోలైట్ డిజిటల్ సంస్థ అవార్డులు పొందింది.
ఇవీ చదవండి: