కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సికింద్రాబాద్ అల్వాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీఆర్పీఎఫ్, టీం సాయి ప్యాండెమిక్ టాస్క్ ఫోర్స్ సంస్థ భాగస్వాములుగా అల్వాల్, లోతుకుంట ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై ద్రావణాన్ని చల్లారు. రోజూ నగర వ్యాప్తంగా 50 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అన్నిచోట్లా పిచికారీ చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వైరస్ను అరికట్టేందుకు హైపోక్లోరైట్ పిచికారీ - అల్వాల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి
వైరస్ను అరికట్టేందుకు అల్వాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీఆర్పీఎఫ్, టీం సాయి ప్యాండెమిక్ టాస్క్ ఫోర్స్ సంస్థ భాగస్వాములుగా కార్యక్రమాన్ని చేపట్టారు.
![వైరస్ను అరికట్టేందుకు హైపోక్లోరైట్ పిచికారీ HYPOCHLLORIDE SPAYS IN HYDERBAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6973825-122-6973825-1588070995496.jpg)
వైరస్ను అరికట్టేందుకు హైపోక్లోరైట్ పిచికారీ
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కరోనా భయంతో మానసికంగా కుంగిపోయిన వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.