తెలంగాణ

telangana

ETV Bharat / state

E Race in Hyderabad: సాగరతీరంలో ప్రపంచ ఫార్ములా ఈ- రేస్.. కేటీఆర్​కు ఆనంద్​ మహీంద్రా అభినందనలు - E sport management

E Race in Hyderabad:వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఫార్ములా-ఈ స్పోర్ట్ నిర్వహణకు హైదరాబాద్ వేదిక కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్‌, రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ కో గ్రూపు సంయుక్తంగా హైదరాబాద్‌లో ఈ రేస్ నిర్వహణకు బీజంవేశాయి. 2.37 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్‌ను గుర్తించిన ఫార్ములా-ఈ నిర్వాహకులు ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను మార్చుకున్నారు. మరో మూడు నెలల్లో రేస్ నిర్వహణపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలోని అతికొద్ది నగరాలకు వేదికైన ఈ ఫార్ములా ఈ రేస్‌ను మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌లో చూడొచ్చు.

E Race in Hyderabad:
ఫార్ములా-ఈ స్పోర్ట్ నిర్వహణకు హైదరాబాద్ ఎంపిక

By

Published : Jan 18, 2022, 5:52 AM IST

E Race in Hyderabad: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఫార్ములా-ఈ స్పోర్ట్‌..... త్వరలో హైదరాబాద్‌కు రానుంది. ఫార్ములావన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌రేస్ కార్లతో జరిపే.. ఈ- రేస్ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా హైదరాబాద్ ఎంపికైంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులు ప్రమోటర్ గ్రీన్‌కో గ్రూపుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెండ్ మార్చుకున్నారు. రాబోయే 90 రోజుల్లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని నిర్వాహకులు ప్రకటించారు.

ఆనంద్‌ మహీంద్రా ధన్యవాదాలు

Anand Mahindra responded: నవంబర్- ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా రేసింగ్ నిర్వహించే అవకాశముందని తెలిపారు. ఈ-రేస్ నిర్వహణకు సెక్రటేరియట్-తెలుగుతల్లి ఫ్లైఓవర్-హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ట్రాక్‌ గుర్తించారు. హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ద్వారా ఫార్ములా ఈ-రేసింగ్‌ నిర్వహిస్తున్న పారిస్, రోమ్, లండన్, హాంగకాంగ్, న్యూయార్క్, బెర్లిన్ వంటి 18 గ్లోబల్ నగరాల సరసన హైదరాబాద్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా ఫార్ములా- ఈ కల నెరవేరుస్తున్నందుకు మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

కేటీఆర్​కు అరుదైన ఆహ్వానం

KTR: ఫార్ములా ఈ- నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానాన్ని అందించారు. ఈనెల 28, 29న సౌదీలో జరగనున్న 2022 ఏబీబీ ఎఫ్​ఐఏ ఫార్ములా-ఈ రేస్‌కు హాజరుకావాలని కేటీఆర్​ను ఆహ్వానించారు. ఫుల్లీ ఎలక్ట్రిక్ సింగిల్ సీటర్ మోటార్ స్పోర్ట్ ఛాంపియన్ షిప్‌గా పేరొందిన ఫార్ములా ఈ రేస్‌ను 2014 బీజింగ్ లో తొలిసారిగా పరిచయం చేశారు. మోటార్ స్పోర్ట్ రేసింగ్ ద్వారా ఎలక్ట్రిక్ రెవల్యూషన్‌కు ఈ ఛాంపియన్ షిప్ పాటుపడుతోంది. అర్బన్‌రేస్ ట్రాకుల్లో అద్భుతమైన యాక్షన్, సిటీ సెంటర్ సెట్టింగ్స్ ద్వారా ఈ రేస్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా 60 నగరాలతో పోటీపడి E- రేస్ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా హైదరాబాద్‌ ఎంపికకావటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ కర్బనఉద్గారాలను తగ్గించేందుకు పాటుపడుతోన్న తెలంగాణకు ఫార్ములా- ఈ స్పోర్ట్స్ రాక ఈవీ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెరగనున్న హైదరాబాద్ ఇమేజ్

సాగరతీరంలో ప్రపంచ ఫార్ములా ఈ- రేస్

ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీని, రినవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేస్ ద్వారా జీరో కర్బన ఉద్గారాలు వెలుబడతాయి. ఈ గ్లోబల్ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచ పటంలో మరింత ఇనుమడిస్తుంది. దాంతో పాటు ఈవీలో పయనీర్‌లుగా ఉన్న పలు ఆటోమోటివ్ ఇండస్ట్రీలు హైదరాబాద్‌కు తరలిరానున్నాయి.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details