Telangana Weather report: నైరుతి రుతుపవనాలు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర -దక్షిణ ద్రోణి ఒకటి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సుమారు 900మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దీనిప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కొన్ని జిల్లాల్లో 30నుంచి 40కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. నిన్న రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.