తెలంగాణ

telangana

ETV Bharat / state

Today Weather Report: ఉత్తర తెలంగాణకు హెచ్చరిక.. రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు..! - తెలంగాణలో వడగాలులు

Today Weather Report: రాష్ట్రంలో రాగల మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Today Weather Report
రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు

By

Published : Apr 28, 2022, 4:05 PM IST

Today Weather Report: ఉత్తర తెలంగాణలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశముందని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్‌, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలపై ప్రభావం చూపనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షం పడే అవకాశముందని వెల్లడించారు.

ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వివరించారు. ఈ ప్రభావంతో గత 3 రోజులుగా ఉన్న వేసవి తీవ్రత నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది.

ABOUT THE AUTHOR

...view details