తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ వైపు ఎండ... మరోవైపు వాన! - తెలంగాణలో వేసవి తాపం

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కన్నా మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది.

high temperature in telangana
ఓ వైపు ఎండ... మరోవైపు వాన!

By

Published : May 29, 2020, 10:43 AM IST

రాష్ట్రంలో పలు జిల్లాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు, కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వడగాలులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువని తెలిపింది.

చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని అప్రమత్తం చేసింది. శని, ఆదివారాల్లో కూడా గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. గురువారం రాష్ట్రంలోనే గరిష్ఠంగా ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రిపూట మంటలు పుడుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో రాత్రి వాతావరణం బాగా వేడెక్కుతోందని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details