తెలంగాణ

telangana

ఇంగ్లీషు సినిమా తెలుగులో చూడలేకపోతున్నారా... ఇకా టెన్షన్‌ వద్దు!!

By

Published : Jun 13, 2022, 4:32 PM IST

Hyderabad Triple IT Student Research: సాంకేతిక పరిజ్ఞానంతో అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సినిమా రంగంలో అయితే ఈ పరిజ్ఞానం అద్భుతాలు సృష్టిస్తోంది. కొన్ని సినిమాలను ఇతర భాషల్లోకి అనువదించే క్రమంలో నటీనటుల భాషకు, పెదాల కదలికల్లో తేడాలు ఉండటాన్ని చూస్తుంటాం. అలాంటి లిప్‌ సింక్ టెక్నాలజీపై పరిశోధన చేశారు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పీహెచ్‌డీ విద్యార్థులు. ఎలాంటి భాష ఐనా... జనాలకు వారీ ప్రాంతీయ భాషలో అర్థమయ్యేలా కంటెంట్‌ అందించడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం. మరి ఆ టెక్నాలజీ ఏంటో మనం చూసేద్దామా.

Hyderabad Triple IT students unveil Wave2lip artificial intelligence
ఇంగ్లీషు సినిమా తెలుగులో చూడలేకపోతున్నారా... ఇక టెన్షన్‌ వద్దు!!

ఇంగ్లీషు సినిమా తెలుగులో చూడలేకపోతున్నారా... ఇక టెన్షన్‌ వద్దు!!

Hyderabad Triple IT Student Research: సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. సినిమా రంగంలో దీని అవసరం ఇటీవల చాలా పెరిగింది. ఏ భాషలో సినిమా తీసినా.. డబ్బింగ్‌ను వారి పెదాల కదలికలకు అనుగుణంగా మార్చడం కష్టం అయిపోయింది. అలాంటి టెక్నాలజీపైన పరిశోధన చేసి విజయం సాధించారు ఈ యువకులు. 100 భాషల్లో సినిమాను ఆస్వాదించేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశారు.

హైదరాబాద్ ట్రిపుల్‌ ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న రుద్రభా ముఖోపాధ్యాయ, కె.ఆర్ ప్రజ్వల్ ఈ టెక్నాలజీకి తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, మరో ప్రొఫెసర్ వినయ్ సంబూద్రి, సీఈవో పవన్ రెడ్డిలు వీరికి తోడు కావడంతో రెండేళ్లలోనే ఈ టెక్నాలజీ కార్యరూపం దాల్చింది. ఇది పూర్తిగా కృతిమమేధ సహాయంతో పని చేస్తుంది. ఇందుకోసం వందల గంటల వీడియోలను విశ్లేషించి వేవ్ 2లిప్‌ను సృష్టించారు.

ఈ టెక్నాలిజీ వచ్చి చాలా సింపుల్. ఈ టెక్నాలిజీతో కెమెరా, మైక్ లేకుండా... మనం ఏఐ యూజ్ చేసుకుని.. మనం వీడియోస్‌ ఒక టెక్ట్‌ నుంచి తయారు చేయొచ్చు. మనం న్యూస్ పేపర్‌లో ఉన్న టెక్ట్‌ను ఒక వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు. టెక్ట్‌ అంతటిని వీడియోగా మార్చడానికి ఏఐ(కృత్రిమ మేధ) ఉపయోగపడుతోంది. - పవన్ రెడ్డి, వేవ్ 2లిప్ సీఈవో

ట్రిపుల్ ఐటీలోనే రుద్రభా, ప్రజ్వల్‌లు న్యూరల్ సింక్ అనే అంకురసంస్థ స్థాపించారు. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి ప్రాజెక్టు ఈ వేవ్ 2లిప్. వాస్తవానికి ఈ టెక్నాలజీని విద్యార్థుల కోసం తయారుచేశారు. ఇంగ్లీష్‌లో చాలామంది తెలుగు విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఎక్కువ సమాచారం ఆంగ్లంలోనే లభ్యం అవుతుండటంతో చాలామంది చదవలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు సులువుగా వారికి నచ్చిన భాషలోనే నేర్చుకునేలా కృత్రిమ మేధను ఉపయోగించి ఈ వేవ్ 2లిప్‌ను తయారు చేశారు. వేవ్ 2లిప్ టెక్నాలజీని మార్కెట్‌లోకి విడుదల చేయడంతో పలువురు సినీ దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనువాద చిత్రాలకు ఈ టెక్నాలజీ బాగా దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు వేవ్‌ 2 లిప్‌ సంస్థతో ఒప్పందలు చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.

దేశంలో సుమారు 10 భాషల్లో సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఒకభాష నుంచి మరో భాషలోకి డబ్‌ చేసుకోవడం ఈ టెక్నాలజీతో చాలా సులువైన పని. దర్శక, నిర్మాతలకూ సమయం కలిసొస్తుంది. భారత్‌తో పాటు అమెరికా,యూరప్‌లో మార్కెట్లలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచారు. తాజాగా ఈ సంస్థ ప్రతినిధులు వేవ్ 2లిప్ టెక్నాలజీ అమెరికా పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు.

''ప్రపంచంలోనే ఇది తొలి టెక్నాలజీ. ఇదే అంశంపై గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, ప్రపంచంలో ఎవరి వాయిస్‌కైనా, ఏ భాషకైనా లిప్‌ అనుసంధానం చేయవచ్చు. మనుషుల వాయిస్‌లకు బదులు జనరేట్‌డ్‌ వాయిస్‌లు, ఏఐ జనరేటడ్‌ వాయిస్‌లకు ఈ సాఫ్ట్‌వేర్‌ పని చేస్తుంది. విభిన్నమైన వాయిస్‌లు, భాషలకు ఇది ఉపయోగపడుతుంది. 720పిక్సల్‌ నుంచి 4కే వరకు అన్ని రిజల్యూషన్స్‌కు కూడా ఇది పని చేస్తుంది. విభిన్నమైన అంశాలతో కూడిన ఈ సాఫ్ట్‌వేర్‌ చాలా ప్రత్యేకమైనది.'' - రుద్రభా ముఖోపాధ్యాయ, వేవ్ 2లిప్ సీటీవో

హాలీవుడ్ స్థాయిలో ఈ టెక్నాలజీని తీసుకెళ్లాలని రుద్రభా, పవన్ రెడ్డిలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విద్యారంగంలోనే కాక సినీరంగంలోనూ ఈ టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details