భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగే సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ నగర (ట్రాఫిక్) జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అబిడ్స్ జీపీవో కూడలిలో జరిగే ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా - Telangana Rashtra Samoohika Jateeya Geethaalapana
సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో అబిడ్స్ చౌరస్తా వద్ద పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జాగిలాలు, బాంబు నిర్వీర్య దళంతో తనిఖీలు చేస్తున్నారు. సామూహిక జాతీయ గీతాలాపనలో 5 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా
ఆంక్షలిలా..
- లిబర్టీ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మీదుగా బాబుజగ్జీవన్‌రామ్ కూడలి వైపు వచ్చే వాహనాలను అబిడ్స్ వైపు అనుమతించరు. ఖాన్ లతీఫ్‌ఖాన్ బిల్డింగ్, ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
- లిబర్టీ నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ కూడలి దిశగా ఆర్టీసీ బస్సులనూ అనుమతించరు. లిబర్టీ నుంచి హిమాయత్‌నగర్, నారాయణగూడ మీదుగా కాచిగూడ, కోఠి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- కింగ్‌కోఠి నుంచి అబిడ్స్ ప్రధాన రహదారి మార్గంలో ట్రాఫిక్‌ను అనుమతించరు. కింగ్‌కోఠి ఎక్స్ రోడ్డు వద్ద హనుమాన్ టేక్డీ, ట్రూప్‌బజార్, కోఠి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- బొగ్గులకుంట నుంచి అబిడ్స్ ప్రధాన రహదారి వైపు వచ్చే ట్రాఫిక్ కూడా బొగ్గులకుంట కూడలి నుంచి హనుమాన్ టెక్డీ, ట్రూప్‌బజార్ మీదుగా కోఠి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- ఎంజే మార్కెట్, జాంబాగ్ మీదుగా అబిడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి స్టేషన్ వైపు మళ్లిస్తారు.
- పీసీఆర్ నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ కూడలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి నాంపల్లి స్టేషన్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
వాహనాలు నిలిపే ప్రదేశాలు..
- లిబర్టీ నుంచి అబిడ్స్ జీపీవోలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలను నిజాం కళాశాల క్రీడామైదానంలో నిలపాల్సి ఉంటుంది. అబిడ్స్ తాజ్‌మహల్ నుంచి కింగ్‌కోఠి కూడలి, బాటా నుంచి బొగ్గులకుంట కూడలి, జీహెచ్‌ఎంసీ కార్యాలయం, రామకృష్ణ థియేటర్ ప్రాంగణం, గ్రామ్ స్కూల్ వద్ద కూడా వాహనాలు నిలపడానికి అనుమతిస్తారు.
- ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ నుంచి వచ్చేవారు తమ వాహనాలను నాంపల్లి అన్నపూర్ణ హోటల్ రోడ్డు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌కు అనుమతిస్తారు.
- ఇవీ చదవండివాజ్పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు
- ఇది రిపీట్ అయితే కథ వేరేలా ఉంటది