హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి వారి మంచి మనస్సును చాటుకున్నారు. గ్రీన్ ఛానల్లో భాగంగా కలకత్తాలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కాలేయం, మూత్రపిండాలు సేకరించి.. అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం 6.39 నిముషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 30 నిముషాల్లోనే కిమ్స్ ఆసుపత్రికి చేరుకునేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.
గ్రీన్ ఛానల్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత - hyderabad police record with green channel till 30 minutes
కలకత్తాలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కాలేయం, మూత్రపిండాలను బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి చేరవేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసి మరోసారి వారి ఘనత చాటుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి కేవలం 30 నిమిషాల్లో చేరేలా ఏర్పాటు చేశారు.
గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని అవయవాలను భద్రంగా చేరేలా చూశారు. ఓ మనిషి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను పలువురు ప్రశంసించారు. ఇప్పటివరకు అవయవాలను భద్రంగా గమ్యస్థానానికి చేరవేసేందుకు ఐదు సార్లు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.