తెలంగాణ

telangana

ETV Bharat / state

Traffic Police special drive: జూబ్లీహిల్స్​ కేసుతో పోలీసుల అప్రమత్తం.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..!

Traffic Police special drive: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసుతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్ల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ ఉంటే జరిమానా విధించనున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ లేకున్నా, సరైన విధానంలో లేకపోయినా జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనికోసం ఈ నెల 18 నుంచి ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు.

hyderabad traffic police
ట్రాఫిక్ పోలీసులు

By

Published : Jun 13, 2022, 10:04 PM IST

Traffic Police special drive: ఇకపై నగరంలో కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వినియోగించే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించనున్నారు. ఇప్పటికే సాధారణ తనిఖీలు భాగంగా బ్లాక్ ఫిల్మ్ వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసుతో మరింత కఠినంగా అమలు చేయనున్నారు. దీనికోసం ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కార్యాచరణ రూపొందించారు.

కార్లకు బ్లాక్ ఫిల్మ్, టెంటెడ్ గ్లాస్ పెట్టుకున్నా, సరైన నెంబర్ ప్లెట్ లేకున్నా చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సరైన విధానం నెంబర్​ ప్లేట్ అమర్చుకోకపోయినా జరిమానా విధించనున్నారు. వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెలలోపు శాశ్వత నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లతో తిరిగితే మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గత నెల 28న జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై నిందితులు ఇన్నోవా వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్నోవా వాహనం 2019లో కొనుగోలు చేసినా.. ఇప్పటికీ తాత్కాలిక రిజిస్ట్రేషన్​తోనే తిరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇన్నోవా వాహనానికి బ్లాక్ ఫిల్మ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా వాహనాలపై జరిమానా విధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details