తెలంగాణ

telangana

ETV Bharat / state

నీ రూల్స్​లో సేఫ్టీని చేర్చుకో బాసూ..!

ట్విట్టర్​లో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు నిన్న ఒక పోస్టును నెటిజన్లతో పంచుకున్నారు. శిరస్త్రాణం ధరించకుండా వెళ్తున్న ఓ యువకుని ఫొటోను షేర్​ చేశారు. అతని వాహనం వెనకాల మైలైఫ్​- మైరూల్స్​ను గమనించి 'పోలీసులకు నీ రూల్సేంటో తెలియవు.. నీ రూల్స్​లో సేఫ్టీని చేర్చుకో'వాలని తెలిపారు.

నీ రూల్స్​లో సేఫ్టీని చేర్చుకో బాసూ..!
నీ రూల్స్​లో సేఫ్టీని చేర్చుకో బాసూ..!

By

Published : Feb 4, 2020, 9:15 AM IST

ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదాల్లో 22 మంది మరణిస్తే... వారిలో 12 మంది శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే తలకు తీవ్రగాయాలై మృతి చెందినట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ... శిరస్త్రాణం ధరించని వారిపై... జరిమానా విధిస్తున్నారు. అయినా... కొంతమంది మాత్రం శిరస్త్రాణం ధరించడం లేదు.

హెల్మెట్​ ధరించకుండా ద్విచక్ర వాహనంపై వెన్న ఓ వ్యక్తి ఫోటోను ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. సదరు వ్యక్తి నెంబర్ ప్లేట్ కింద 'మై లైఫ్- మై రూల్స్' అంటూ రేడియం అంటించాడు. దానిని ట్విట్టర్​లో షేర్​ చేసిన ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ నువ్వు హెల్మెట్​ ధరించినప్పుడే నీ లైఫ్ నీ చేతుల్లో ఉంటుందంటూ పేర్కొన్నారు. నీ రూల్స్​ ఏంటో హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీసులకు తెలియవని చెప్పారు. వాళ్లకు తెలిసిందల్లా మోటార్​ వెహికిల్​ యాక్ట్​లోని సెక్షన్​ 129(హెల్మెట్​ ధరించకపోతే జరిమానా) మాత్రమేనన్నారు.

అదనపు సీపీ చేసిన ట్వీట్

చివరగా నీ రూల్స్​లో సేఫ్టీని చేర్చుకోమంటూ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్​కుమార్​ ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:'వాహన చోదకులు తప్పని సరిగా ట్రాఫిక్​ నియమాలు పాటించాలి'

ABOUT THE AUTHOR

...view details