Lungs Transport by Green Channel: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యలతో మరోసారి గ్రీన్ ఛానల్ విజయవంతమైంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ఊపిరితిత్తులను నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి ఊపిరితిత్తులు తరలించడానికి పోలీసు అధికారులు ఈ సౌకర్యం ఏర్పాటు చేశారు. శంషాబాద్ నుంచి కిమ్స్ ఆస్పత్రి వరకు 36.8 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల వ్యవధిలో అధిగమించి ఊపిరితిత్తులు తరలిస్తున్న అంబులెన్స్ చేరుకుంది.
ట్రాఫిక్ పోలీసుల ఘనత.. గ్రీన్ ఛానల్ ద్వారా ఊపిరితిత్తుల తరలింపు - lungs transport through green channel
Lungs Transport by Green Channel: దాదాపు 37 కిలోమీటర్లు.. హైదరాబాద్ మహా నగరంలో ఈ దూరాన్ని అధిగమించాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుంది. కానీ ట్రాఫిక్ రద్దీని అధిగమించి కేవలం 25 నిమిషాల సమయంలోనే ఓ వ్యక్తికి ఊపిరిలూదేందుకు తమ వంతు కృషి చేశారు ట్రాఫిక్ పోలీసులు. అందుకోసం మరోసారి గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి అతి తక్కువ సమయంలోనే ఊపిరితిత్తులను చేరవేశారు.
గ్రీన్ ఛానల్ ద్వారా ఊపిరితిత్తుల తరలింపు
మధ్యాహ్నం గం. 3.01 కి విమానాశ్రయం నుంచి బయలుదేరిన అంబులెన్స్.. కిమ్స్‌కు గం. 3.26 నిమిషాలకు చేరుకుంది. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ కారణంగా ఊపిరితిత్తులు వేగంగా ఆస్పత్రికి చేరుకోవడంతో... ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది ట్రాఫిక్ పోలీసుల కృషిని అభినందించారు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ తరహాలో అవయవాలను తరలించడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో నలువైపులా ఆస్పత్రులకు త్వరలో సీఎం శంకుస్థాపన: హరీశ్