ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నవారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రోత్సాహకాలు అందించారు. ద్విచక్ర వాహనం నడుపుతూ శిరస్త్రాణం ధరించడం, కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం...అలాగే ఎటువంటి జరిమానలు లేని వాహనదారులకు పోలీసులు బహుమతులు అందించారు. బషీర్బాగ్లోని ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొని నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను అభినందించారు. వాహనదారులు తూ.చ. తప్పకుండా నిబంధనలు పాటించాలని అంజనీకుమార్ సూచించారు. నిబంధనలను పాటిస్తున్న వారిని గుర్తించి ప్రతి నెలా ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. బహుమతులు గెలుచుకోండి... - Hyderabad traffic police
రహదారులపై నిబంధనలను పాటించే వాహనదారులను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండే వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ట్రాఫిక్ నిబంధన పాటించండి.. బహుమతులు గెలుచుకోండి...