తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టీఎన్జీవో సంఘం - తెలంగాణ వార్తలు

విపత్కర సమయంలోనూ పాత్రికేయులు వార్తలు అందిస్తున్నారని తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్​ అధ్యక్షుడు ముజీబ్​ అన్నారు. హైదరాబాద్​ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్​లో పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టీఎన్జీవో సంఘం
పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టీఎన్జీవో సంఘం

By

Published : Jun 12, 2021, 3:06 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్​లో తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ పాత్రికేయులకు నిత్యావసర సరకులను అందజేశారు. బియ్యం, పప్పు, నూనెను 50మందికి పంపిణీ చేశారు.

పాత్రికేయులు సమాజానికి నిర్మాణాత్మక సేవలందిస్తున్నారని ముజీబ్ కొనియాడారు. ఇంతటి విపత్కర సమయంలోనూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:Vaccine: కేంద్రం నుంచి వచ్చిన టీకాలు ఎన్ని? ఇంకా ఎంత అవసరం?

ABOUT THE AUTHOR

...view details