తెలంగాణ

telangana

ETV Bharat / state

'మమ్మల్ని కాపాడండి.. ఇటలీలో హైదరాబాద్​ విద్యార్థుల ఆవేదన' - STUCKED IN ITALY

కరోనా ప్రభావంతో హైదరాబాద్​కు చెందిన విద్యార్థులు ఇటలీలో బిక్కు బిక్కుమంటున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వారు చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని వాపోతున్నారు. ఈ మేరకు తమను భారత్​కు రప్పించాలని వేడుకుంటున్నారు.

మమ్మల్ని స్వదేశానికి రప్పించండి : విద్యార్థులు
మమ్మల్ని స్వదేశానికి రప్పించండి : విద్యార్థులు

By

Published : Mar 27, 2020, 8:14 AM IST

కరోనాతో మరణ మృదంగం మోగిస్తోన్న ఇటలీలో హైదరాబాద్​కు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. భారత్​కు తిరిగివచ్చేందుకు తాము చివరివరకు ప్రయత్నించినా... ఫలించలేదని వాపోయారు. ఇటలీలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా తమకు సహకారం లభించట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం భారత్​లో దేశీయ, విదేశీ విమానాల రాకపోకలు నిలిపేశారు.

ఇటలీలో కరోనా విలయ తాండవం చేస్తుండటం వల్ల విద్యార్థులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. తమతోపాటు 130కు పైగా భారతీయ విద్యార్థులం ఇక్కడ చిక్కుకున్నామని అన్నారు. తమను స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్రం చొరవ చూపాలని సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థిస్తున్నారు.

మమ్మల్ని స్వదేశానికి రప్పించండి : విద్యార్థులు

ఇవీ చూడండి : 'దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించండి'

ABOUT THE AUTHOR

...view details