హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉండే ఓ యువకుడు లాక్‌డౌన్ వల్ల బోర్ కొడుతుంది.. ఎలాగైనా దమ్ము కొట్టాల్సిందేనంటూ.. అల్వాల్‌లోని తన మిత్రుడికి ఫోన్ చేశాడు. సాయంత్రం లోపు నీ చేతిలో ‘సరకు’ ఉంటుందని బదులిచ్చిన మిత్రుడు... చెప్పినట్లే రాత్రికి ఆ యువకుడికి దాన్ని చేరవేశాడు. నగరంలో లాక్‌డౌన్ ఉన్నా.. దూల్‌పేటకు చెందిన ఓ యువకుడి ద్వారా ఆ సరకు అల్వాల్‌కి చేరింది. అక్కడి నుంచి సాయంత్రానికి ముషీరాబాద్‌కి చేర్చాడు ఈ మిత్రుడు. అంతటా పోలీస్ చెకపోస్టులున్న నేపథ్యంలో ఆ పొట్లాలను షూ లోపల పెట్టి ఒకరికొకరు చేతులు మార్చుకున్నారు.’
అబ్బాయిలు... అమ్మాయిలూ...
వీటి తయారీకి, సరఫరాకి ప్రధాన కేంద్రాలుగా దూల్‌పేట, గోల్కొండ పరిధిలోని లక్ష్మీనగర్, బోయిన్‌పల్లి, బాలానగర్, ఫతేనగర్ మారాయి. ఇక్కడి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు గంజాయి చేరుతోంది. కళాశాలల్లో ఒకరి నుంచి ఒకరికి అలవాటు కావడం వల్ల అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా గంజాయి కొడుతున్నారు. అమ్మాయిలు సైతం ప్రత్యేక కోడ్ భాష ద్వారా చర్చలు చేసుకుంటున్నారు.
భారీగా డిమాండ్...