Hyderabad Steel Bridge Opening Ceremony :హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఎస్.ఆర్.డి.పి ద్వారా రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్ట మొదటి స్టీల్ ఫ్లై ఓవర్‌గా (Steel Bridge) నిలవనున్నది. నగరంలోని ఇందిరా పార్కు వద్ద నిర్మించిన ఈ నిర్మాణం.. మిగితాఫ్లై ఓవర్లకంటే భిన్నంగా మొత్తం స్టీల్‌తో పూర్తి చేశారు. మొట్ట మొదటి సారిగా మెట్రో బ్రిడ్జిపై (Metro Bridge)నుంచి ఫ్లై ఓవర్ చేపట్టడం జరిగింది. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి గ్రేటర్లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
ఇంది అందుబాటులోకి వస్తే.. 4 జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి సివిల్ వర్క్స్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులతో మొత్తం రూ. 450 కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తి చేసింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ వలన ఇందిరా పార్కు నుంచి వి.ఎస్.టి. స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC Cross Road) వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ (OU), హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
Hyderabad Steel Bridge Uses :ఇందిరా పార్క్, అశోక్ నగర్, అర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వి.ఎస్.టి. జంక్షన్ వరకు సులభంగా చేరుకోవచ్చు. హైదరాాబాద్‌లో ఆధునిక రోడ్డు రవాణా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాహనాల సంఖ్య విస్తృతంగా పెరగడంతోట్రాఫిక్, కాలుష్య సమస్యలు (Pollution problems), ప్రయాణ సమయం తగ్గించడం, సగటు వేగం పెంచడం కోసంజీహెచ్ఎంసీ (GHMC) కొన్ని లక్ష్యాలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 45 పనులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 35 పనులు పూర్తయ్యాయి.
Naini Narsimha Reddy Flyover at Indira Park :ఇందిరా పార్కు నుంచి వి.ఎస్.టి స్టీల్ బ్రిడ్జి 20వ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 7 ఆర్.ఓ.బి, ఆర్.యు.బిలు, 1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రోడ్డు వెడల్పు, పనులు పూర్తయ్యాయి. మిగతా 12 పనులు 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది.