తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్ధరాత్రి పురిటి నొప్పులు.. కాపాడిన పోలీసులు - police rescued a pregnant woman

అర్ధరాత్రి.. నిండు గర్భిణీ.. ఓ వైపు లాక్ డౌన్... మరో వైపు ఆ తల్లికి పురిటినొప్పులు..! ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచలేదు. చివరికి పోలీసులకు ఫోన్ చేశారు. ఆలస్యం చేయకుండా వెంటనే వారు స్పందించి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడారు.

hyderabad-sr-nagar-police-rescued-a-pregnant-woman
అర్ధరాత్రి పురిటి నొప్పులు.. కాపాడిన పోలీసులు

By

Published : Jun 18, 2021, 11:57 AM IST

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు ఓ నిండు గర్భిణీ ప్రాణాలను కాపాడారు. అర్ధరాత్రి సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో బోరబండలోని సాయిబాబా నగర్​కు చెందిన ఫర్హానా బేగం అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. లాక్ డాన్ కారణంగా దగ్గర్లో ఏ వాహనం లేకపోవడంతో.. 100 కు ఫోన్ చేయగా.. ఎస్ఆర్ నగర్ పోలీసులు వెంటనే స్పందించారు.

బోరబండలో పెట్రోలింగ్ విధి నిర్వహణ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి ప్రసాద్, హోంగార్డ్స్ శ్రావణ్ సకాలంలో స్పందించారు. మహిళను స్థానిక లక్డీకపూల్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలను కాపాడారు. డెలివరీ అనంతరం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకు వచ్చి, ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సాయిప్రసాద్, హోంగార్డు శ్రావణ్ పోలీసు సిబ్బందిని స్థానికులు, వైద్యాధికారులు అభినందించారు.

ఇదీ చూడండి: Dhanush: ధనుష్ తొలి​ తెలుగు సినిమా.. అదీ పాన్ ఇండియా కథతో

ABOUT THE AUTHOR

...view details