కుటుంబాలతో, బంధుమిత్రులతో కలిసి పండగ కోసం ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ డిపో వినూత్న ప్రయోగం చేపట్టింది. కొన్ని కుటుంబాలు కలిసి బస్‌ను బుక్ చేసుకుంటే వారి నివాస ప్రాంతం నుంచి గమ్య స్థానాలకి చేరవేస్తామని చార్మినార్ డివిజనల్ మేనేజర్ రాములు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. పబ్లిక్ డిమాండ్‌ని బట్టి ఇరు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలకు చార్మినార్ డివిజన్ నుంచి 100 బస్‌లను నడుపుతున్నామని, మరిన్ని బస్‌లను నడపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నివాస ప్రాంతం నుంచే కోరుకున్న గ్రామాలకు చేరవేస్తాం
సంక్రాంతి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ డిపో వినూత్న ప్రయోగం చేపట్టింది. ప్రయాణికులు కోరుకుంటే.. వారి నివాస ప్రాంతం నుంచే గమ్య స్థానాలకి చేరవేస్తామని తెలిపింది. దీనికోసం చార్మినార్ డివిజన్ నుంచి 100 బస్‌లను నడుపుతున్నామని ప్రకటించింది.
దీనిపై మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఫారూఖ్ నగర్ డిపోలో పలువురు డిపో మేనేజర్లతో రాములు సమావేశమయ్యారు. బస్‌లను బుక్ చేయదలచిన వారు ఫలక్‌నుమా, ఫారూఖ్ నగర్, రాజేంద్రనగర్, తదితర డిపో మేనేజర్లను, లేదా డివిజనల్ మేనేజర్లను సంప్రదించాలని ప్రజలను కోరారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఫారూఖ్ నగర్ డిపో మేనేజర్ కె కుమార్, ఫలక్‌నుమా డిపో మేనేజర్ ఇసాక్, తదితరులున్నారు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అచ్చు పులిలా ఉంది.. ఊరిని భయపెట్టిన గ్రామసింహం..!