తెలంగాణ

telangana

ETV Bharat / state

Passport Services: ఇక నుంచి వంద శాతం పాస్​పోర్టు సేవలు.. - హైదరాబాద్ తాజా వార్తలు

Passport Services: తెలంగాణలో బుధవారం నుంచి పాస్​పోర్టు సేవలను వందశాతం పునరుద్ధరించినట్లు సికింద్రాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు అధికారి దాసరి బాలయ్య పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల వల్ల ఆపిన సేవలను తిరిగి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గతంలో అపాయింట్​మెంట్లు పొందిన దరఖాస్తుదారులు దగ్గరలోని పాస్​పోర్టు​ కేంద్రాలకు వెళ్లి రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు.

hyderabad passport office
హైదరాబాద్ పాస్​పోర్టు కార్యాలయం

By

Published : Feb 10, 2022, 10:58 AM IST

Passport Services: తెలంగాణలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి వందశాతం అపాయింట్​మెంట్​లు విడుదల చేస్తున్నట్లు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. కరోనా కారణంగా గత నెల 18 నుంచి 50శాతం, 28 నుంచి 30శాతం లెక్కన అపాయింట్‌మెంట్లు విడుదల చేస్తూ వచ్చామన్నారు. దీంతో స్లాట్లు దొరకాలంటే దరఖాస్తుదారులకు కనీసం 30 రోజులు సమయం పట్టేదని వివరించారు. చాలా మంది పాస్‌పోర్టు సేవలను సకాలంలో పొందలేక ఇబ్బందులు పడుతూ వచ్చారని ఆయన తెలియచేశారు.

వంద శాతం సేవలు...

సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని నాలుగు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు... రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల్లోనూ పాస్‌పోర్టు సేవలు అందించే అన్ని కేంద్రాల్లోనూ వంద శాతం ఇస్తున్నట్లు దాసరి బాలయ్య వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెలలో అపాయింట్‌మెంట్లు పొందిన దరఖాస్తుదారులు దగ్గర లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలకు వెళ్లి తమ అపాయింట్​మెంట్లను రీషెడ్యూల్‌ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :Job notifications: ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ.. !

ABOUT THE AUTHOR

...view details