ఇటీవల పడుతున్న వరుస వర్షాలతో ప్రధాన రోడ్లతో పాటు, పలు లింకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. పెద్ద పెద్ద గుంతలతో పాటు.. రోడ్ల తారు మొత్తం లేచిపోయింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పలు రోడ్లలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేయకుంటే... రాజధాని రహదారులు.. నగరవాసులకు నరకప్రాయం అవడం ఖాయం.
భాగ్యనగరంలో వర్షం పడితే భయమే! - చెరువలను తలపించే రోడ్ల మీద మ్యాన్ హోల్స్‌ను తప్పించుకుని బయటపడడం
చినుకు పడితే చాలు భాగ్యనగర వాసులు భయపడుతున్నారు. చెరువలను తలపించే రోడ్ల మీద మ్యాన్ హోల్స్‌ను తప్పించుకుని బయటపడడం నగర జీవుల సహనాన్ని పరీక్షిస్తోంది. నెక్లెస్ రోడ్ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారటం వల్ల వాహనదారులు పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
![భాగ్యనగరంలో వర్షం పడితే భయమే!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4730835-331-4730835-1570879470965.jpg)
భాగ్యనగరంలో వర్షం పడితే భయమే!