Hyderabad IT Employees Rain Alert : భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నగర పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల క్రితం ఐటీ కారిడార్‌లో కంపెనీలకు 3 దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలనిఐటీ కంపెనీలకు పోలీసులు సూచించారు. ఈ క్రమంలో తాజాగా ఐటీ ఉద్యోగులకు కేటాయించిన ప్రత్యేక లాగౌట్ సమయాన్ని మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్(పీఎస్‌ఐవోసీ)లో సమీక్షించారు.
Special Logout Hyderabad IT Employees :హైదరాబాద్‌లోని ప్రధాన రహదారుల్లో ఉదయం 9 నుంచి 11 వరకు సాయంత్రం 5నుంచి 8 వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు వెళ్లేవాళ్లతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. వర్షం పడిన సమయంలో వాహనాలు వేగంగా ముందుకువెళ్లలేక నెమ్మదిగా కదులుతుండటంతో రహదారులన్ని వాహనాలతో నిండిపోతున్నాయి. రహదారులపై వర్షపునీరు నిలిస్తే సమస్య మరింత జఠిలమవుతోంది. కిలోమీటర్ ప్రయాణానికే... 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇక ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు ఐటీ కారిడార్‌లోని వివిధకంపెనీల్లో పనిచేస్తున్నారు.
Rain Alert Hyderabad IT Employees :చిన్నపాటి వర్షానికే నగరంలో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. ఈ క్రమంలోఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసంమాదాపూర్ పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా వాహనాలన్నీ రహదారులపైకి వస్తుండటంతో సమస్య తీవ్రమవుతుందని గుర్తించిన పోలీసులు ఐటీ కంపెనీలకు పలు సూచనలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఐటీ కంపెనీల వేళల్లో తగిన మార్పులు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. 3 దశల్లో ఉద్యోగులు విధులు ముగించుకునేలా ఐటీ కంపెనీలకు సూచనలు చేశారు.
ఫేజ్ - 1 :ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.