తెలంగాణ

telangana

ETV Bharat / state

నాంపల్లి రైల్వే స్టేషన్‌కు ఘనమైన చరిత్ర.. స్వరాజ్య పోరాటానికి ప్రతిరూపం - దక్కన్ రైల్వే స్టేషన్‌

hyderabad railway station: స్వరాజ్య పోరాటంలో ఎన్నో ఘట్టాలకు ప్రతిరూపంగా నిలిచే దక్షిణ మధ్య రైల్వేలో నాంపల్లి స్టేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో సమరయోధులకు నాడు వేదికైన ఈ స్టేషన్‌ దక్కన్‌ ప్రాంతంలో స్వరాజ్య స్ఫూర్తిని నింపి బానిస సంకెళ్లు తెంచేందుకు బాటలు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన హైదరాబాద్‌ స్టేషన్‌పై స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

నాంపల్లి రైల్వే స్టేషన్‌
నాంపల్లి రైల్వే స్టేషన్‌

By

Published : Aug 10, 2022, 9:26 PM IST

hyderabad railway station: రాష్ట్ర రాజధానిలోని నాంపల్లిలో ఉండే హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్‌ను 1907లో అప్పటి నిజాం నిర్మించారు. దక్కన్ శైలిలో సొగసైన ముఖభాగంతో రూపుదిద్దుకున్న ఈ స్టేషన్‌లో ప్రధానంగా ప్రవేశద్వారం నిజాం నాటి వైభవాన్ని చాటి చెబుతుంది. ప్రారంభంలో గూడ్స్ రైళ్లను మాత్రమే తిప్పేవారు. 1921లో మొదటిసారి ప్యాసింజర్ రైలు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అందుబాటులోకి వచ్చింది. 1929 -1934 మధ్య స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ పలుమార్లు హైదరాబాద్‌ను సందర్శించారు.

1929 ఏప్రిల్ 6వ తేదీన మహాత్మాగాంధీ మొదటిసారి హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చారు. 1934లో రెండవసారి జాతిపిత రాష్ట్రానికి వచ్చారు. మహాత్మాగాంధీ రెండోసారి హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లిన తర్వాత సబర్మతి ఆశ్రమం నుంచి హైదరాబాద్ ప్రజలకు తన అనుభవాలను లేఖ రూపంలో రాశారు. 1932లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం హైదరాబాద్ రైల్వే స్టేషన్​ను సందర్శించారు. గాంధీజీ నడయాడిన ఈ స్టేషన్‌ను స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ నగరవాసులు గుర్తుచేసుకుంటున్నారు.

నాంపల్లి రైల్వే స్టేషన్‌కు ఘనమైన చరిత్ర.. స్వరాజ్య పోరాటానికి ప్రతిరూపం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్‌తోనూ మహాత్మాగాంధీకి ప్రత్యేక అనుబంధం ఉంది. గాంధీజీ విజయవాడకు మొదటిసారిగా 1919 మార్చి 13వ తేదీన వచ్చారు. రామ్ మోహన్ రాయ్ లైబ్రరీలో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో జాతిపిత ప్రసంగించారు. అయ్యదేవర కాళేశ్వర్ రావు, మూట్నూరి కృష్ణారావు వంటి స్వాంతంత్ర్య పోరాటకులు మహాత్ముడి స్పూర్తితో గాంధేయవాదులుగా మారారు. 1919 నుంచి 1946 మధ్య గాంధీ ఏడుసార్లు విజయవాడలో పర్యటించారు. కృష్ణానది ఒడ్డున కళకళలాడే వాణిజ్యనగరమైన బెజవాడతో జాతిపిత మహాత్మాగాంధీకి ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధం ఉండేదని స్వాతంత్ర్య సమరయోధులు గుర్తుచేసుకుంటున్నారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే 75 రైల్వే స్టేషన్లలో, స్వాతంత్ర్య సమరయోధులతో అనుబంధం ఉన్న 27 రైళ్లలో అమృత మహోత్సవాలను నిర్వహిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గద్వాల స్టేషన్లతో పాటు తెలంగాణ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న ఎక్స్ ప్రెస్‌లో ప్రత్యేక ఉత్సవాలను రైల్వే శాఖ నిర్వహించింది.

ఇవీ చదవండి:స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నింపటమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆజాదీకా గౌరవ్ యాత్ర

నుపుర్​ శర్మకు ఊరట.. ఎఫ్ఐఆర్​లన్నీ దిల్లీకి బదిలీ

ABOUT THE AUTHOR

...view details