Hyderabad Police Sets up 'CAMO' For CC Camera Repairs :నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేరస్తులను గుర్తించడంతోపాటు వాళ్లు ఎటువైపు వెళ్లారనే విషయాలను సేకరిస్తున్నారు. ఐతే.. సీసీ కెమెరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని వెంటనే తిరిగి పనిచేసేలా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్(Hyderabad Police Commissionerate)లో క్యామో (కెమెరా మెయింటెనన్స్ ఆర్గనైజేషన్) పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
CC Cameras Importance Role In Police Department : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిఘా నేత్రాలపై(CC Cameras) ఆధారపడి రాష్ట్రంలో 18 వేలకు పైగా కేసులను ఛేదించారు. నేను సైతం కార్యక్రమంకింద కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. పోలీస్ స్టేషన్‌లలో ఉండే కంట్రోల్ రూమ్‌కు సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. పోలీసు అధికారులు.. నిత్యం వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. నిఘా నేత్రాల ఏర్పాటుకు సాయం చేసిన వారికి ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
CC CAMERAS: సీసీ కెమెరాల్లో తెలంగాణదే అగ్రస్థానం
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10లక్షలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 5లక్షలకుపైగా ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు వరకు బాగానే ఉన్నా.. వాటిలో తలెత్తే సాంకేతిక సమస్యలే(CC Camera Technical Issues)పోలీసులకు తలనొప్పిగా మారాయి. గాలి, వర్షం, ఎండ వల్ల సీసీ కెమెరాలు మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని అలాగే వదిలేయడం వల్ల అసలైన సమయాల్లో ఉపయోగపడటం లేదు.