తెలంగాణ

telangana

ETV Bharat / state

జరభద్రం: ఇప్పటి వరకు కేసులే.. ఇకనుంచి వాహనాలు సీజ్​ - బాలానగర్​ పరిధిలో లాక్​డౌన్ వార్తలు

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించినా... ప్రజల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. లాక్​డౌన్​ సమయంలో బయటకు రావొద్దని పలుమార్లు పోలీసులు హెచ్చరించినా రోడ్లపై సంచరిస్తూనే ఉన్నారు. హైదరాబాద్​ నగరంలో ఇప్పటి వరకు కేసులతో సరిపెట్టిన పోలీసులు.. ఇక నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

lock in hyderabad
హైదరాబాద్​లో పటిష్ఠంగా లాక్​డౌన్​

By

Published : May 20, 2021, 9:10 PM IST

కరోనా కట్టడికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నా... కొందరు వాహనదారులు ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై తిరుగుతుండటంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కేవలం కేసులతో సరిపెట్టిన పోలీసులు ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్​ షాపూర్ నగర్ చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

బాలానగర్ జోన్​లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈనెల 12 నుంచి 20 వరకు సుమారు 5 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తామని, ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం.. పొగాకు వ్యతిరేక ఉద్యమం

ABOUT THE AUTHOR

...view details