తెలంగాణ

telangana

ETV Bharat / state

పైన బ్రాండెడ్... లోపల నకిలీ పత్తి విత్తనాలు - నకిలీ పత్తి విత్తనాల వార్తలు

నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను ఎల్బీనగర్​ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

hyderabad-police-seize-50-lakhs-worth-of-fake-cotton-seeds
పైన బ్రాండెడ్... లోపల నకిలీ పత్తి విత్తనాలు

By

Published : May 29, 2020, 2:33 PM IST

హైదరాబాద్‌లో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, ఎస్​వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి... నిందితులను అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు.

కందుకూర్ పోలీస్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులు డీసీఎం వాహనంలో రెండు టన్నులు నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తుండగా ఎల్బీనగర్​ ఎస్​వోటీ పోలీసులు, వ్యవసాయ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్​ కంపెనీల పేరుతో ఉన్న కవర్లను వీరు కడపలో తయారు చేస్తున్నారు. వాటిలో నాసిరకం విత్తనాలు వేసి మార్కెట్​లో అమ్ముకుంటూ... సొమ్ము చేసుకుంటున్నారు.

-రాచకొండ సీపీ మహేష్ భగవత్

పైన బ్రాండెడ్... లోపల నకిలీ పత్తి విత్తనాలు

నకలీ విత్తనాలు మార్కెట్లో అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ భవగత్‌ హెచ్చరించారు.

ఇవీ చూడండి:రాజ్యసభ సచివాలయంలో కరోనా కల్లోలం

ABOUT THE AUTHOR

...view details